ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. నిరుద్యోగ భృతిని రూ.2,000కు పెంచనున్న ప్రభుత్వం!
- ముఖ్యమంత్రి యువనేస్తం పథకంపై కీలక నిర్ణయం
- అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే అమలుచేస్తాం
- అమరావతిలో ముగిసిన టీడీఎల్పీ భేటీ
కాగా, ఫిబ్రవరి చివరికల్లా అభ్యర్థుల ఎంపికను పూర్తిచేస్తామని సీఎం అన్నారు. ఎన్నికల ప్రచారానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రమంతటా బస్సుయాత్ర చేపట్టాలా? లేక రోజూ రెండు జిల్లాల చొప్పున పర్యటించాలా? అనే విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు టీడీఎల్పీ సమావేశం ముగిసిన నేపథ్యంలో మరికాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో పసుపు-కుంకుమ పథకానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది.