akhil: స్మోకింగ్ అలవాటు ఉండేది.. వదిలేశా: అక్కినేని అఖిల్

  • 'మిస్టర్ మజ్ను' సినిమాతో మంచి మార్కులు కొట్టేసిన అఖిల్
  • సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న అక్కినేని హీరో
  • అందరూ ధూమపానాన్ని వదిలేయాలని సూచన

'మిస్టర్ మజ్ను' సినిమాతో యంగ్ హీరో అఖిల్ సత్తా చాటాడు. ఒక నటుడిగా తనను తాను నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంటూ.. టీవీ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. తనకు స్మోకింగ్ అలవాటు ఉండేదని... ఇటీవలే దాన్ని వదిలేశానని చెప్పాడు. అంతేకాదు, ధూమపానాన్ని అందరూ వదిలేయాలని సూచించాడు.

More Telugu News