charminar express: రైల్లోని టాయ్ లెట్ లో చిక్కుకున్న తెలుగు మహిళ కాలు.. ఆసుపత్రికి తరలింపు

  • రైల్లోని ఆధునిక టాయ్ లెట్ తో ఇబ్బంది పడ్డ మహిళ
  • కాలు రాకపోవడంతో.. మూతతో సహా బయటకు తీసుకొచ్చిన రైల్వే సిబ్బంది
  • ఆసుపత్రికి తరలించి చికిత్స

రైల్లోని ఆధునిక టాయిలెట్ ఉపయోగించడం తెలియక ఏపీకి చెందిన ఓ మహిళ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివరాల్లోకి వెళ్తే, మంగళవారం సాయంత్రం చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరడానికి చార్మినార్ ఎక్స్ ప్రెస్ సిద్ధంగా ఉంది. ఇందులో ప్రయాణిస్తున్న భారతమ్మ (40) అనే మహిళ టాయిలెట్ కు వెళ్లారు.

అందులో ఉన్న ఆధునిక టాయ్ లెట్ ను ఎలా ఉపయోగించాలో ఆమెకు అర్థం కాలేదు. పొరపాటున ఆమె కాలు అందులో ఇరుక్కుపోయింది. కాలును బయటకు లాగేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఆమె కేకలు విన్న తోటి ప్రయాణికులు అక్కడకు చేరుకుని... రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. వారు ప్రయత్నించినా కాలు బయటకు రాలేదు. దీంతో, ఆ టాయిలెట్ మూతతో సహా ఆమెను బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఆసుప్రతికి తీసుకెళ్లి మూతను తొలగించి, ఆమెకు చికిత్స అందించారు. దీని కారణంగా చార్మినార్ ఎక్స్ ప్రెస్ 35 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది.

More Telugu News