India: టైమ్స్ నౌ - వీఎంఆర్ సర్వే.... రాష్ట్రాల వారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..!

  • లోక్ సభ ఎన్నికలకు మరో 3 నెలల సమయం
  • బీజేపీ కూటమికి మెజారిటీ దక్కే అవకాశాలు లేనట్టే
  • టైమ్స్ నౌ - వీఎంఆర్ తాజా సర్వే

ఇండియాలో లోక్ సభ ఎన్నికలకు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉన్న వేళ, టైమ్స్ నౌ - వీఎంఆర్ ఓపీనియన్ సర్వే విడుదల చేసిన అంచనా ఫలితాలు కలకలం రేపుతున్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీకి సాధారణ మెజారిటీ దక్కగా, ఈ సంవత్సరం జరిగే ఎన్నికల్లో బీజేపీ కూటమి (ఎన్డీయే)కు సాధారణ మెజారిటీ దక్కబోదని, ప్రాంతీయ పార్టీలు కీలకం కానున్నాయని ఈ సర్వే అంచనా వేసింది. 545 మంది సభ్యులున్న లోక్ సభలో ఎన్డీయేకు 252 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు 147 సీట్లు, ఏ కూటమిలో లేని ఇతరులకు 144 సీట్లు వస్తాయని, ప్రభుత్వ ఏర్పాటులో వారే కీలకమని పేర్కొంది. ఇక రాష్ట్రాల వారీగా సర్వే అంచనాలను పరిశీలిస్తే...

ఉత్తరప్రదేశ్ (80 సీట్లు): ఏస్పీ - బీఎస్పీ కూటమి 51, ఎన్డీయే 27, ఇతరులు 2
మహారాష్ట్ర (48 సీట్లు): ఎన్డీయే 43, యూపీఏ 5.
పశ్చిమ బెంగాల్ (42 సీట్లు): టీఎంసీ 32, ఎన్డీయే 9, యూపీఏ 1.
బీహార్ (40 సీట్లు): ఎన్డీయే 25, యూపీఏ 15.
తమిళనాడు (39 సీట్లు): యూపీఏ (కాంగ్రెస్ - డీఎంకే) 35, ఏఐఏడీఎంకే 4.
కర్ణాటక (28 సీట్లు): యూపీఏ 14, ఎన్డీయే 14.
గుజరాత్ (26 సీట్లు): ఎన్డీయే 24, యూపీఏ 2.
ఆంధ్రప్రదేశ్ (25 సీట్లు): వైఎస్ఆర్ కాంగ్రెస్ 23, టీడీపీ 2.
రాజస్థాన్ (25 సీట్లు): ఎన్డీయే 17, యూపీఏ 8.
ఒడిశా (21 సీట్లు): ఎన్డీయే 13, బీజేడీ 8.
కేరళ (20 సీట్లు) యూడీఎఫ్ 16, ఎల్డీఎఫ్ 3, ఎన్డీయే 1.
తెలంగాణ (17 సీట్లు): టీఆర్ఎస్ 10, యూపీఏ 5, ఎన్డీయే 1, ఇతరులు 1.
జార్ఖండ్ (14 సీట్లు): యూపీఏ 8, ఎన్డీయే 6.
అసోం (14 సీట్లు): ఎన్డీయే 8, యూపీఏ 3, ఏఐయూడీఎఫ్ 2, ఇతరులు 1.
పంజాబ్ (13 సీట్లు): యూపీఏ 12, ఆప్ 1.
ఛత్తీస్ గఢ్ (11 సీట్లు): యూపీఏ 6, ఎన్డీయే 5.
హర్యానా (10 సీట్లు): ఎన్డీయే 8, యూపీఏ 2.
ఢిల్లీ (7 సీట్లు): ఎన్డీయే 6, ఆప్ 1.
జమ్ము కాశ్మీర్ (6 సీట్లు): నేషనల్ కాన్ఫరెన్స్ 4, యూపీఏ 1, ఎన్డీయే 1.
ఉత్తరాఖండ్ (5 సీట్లు): ఎన్డీయే 5.
హిమాచల్ ప్రదేశ్ (4 సీట్లు): ఎన్డీయే 3, యూపీఏ 1.
అరుణాచల్ ప్రదేశ్ (2 సీట్లు): ఎన్డీయే 2.
మణిపూర్ (2 సీట్లు): యూపీఏ 1, ఎన్డీయే1.
త్రిపుర: (2 సీట్లు): ఎన్డీయే 2.
గోవా (2 సీట్లు): ఎన్డీయే 1, యూపీఏ 1.
నాగాలాండ్ (1 సీటు): ఎన్డీయే 1.
మిజోరం (1 సీటు): ఎన్డీయే 1.
సిక్కిం (1 సీటు): ఇతరులు 1.
దాద్రా అండ్ నగర్ హవేలీ మరియు డామన్, డయ్యూలోని ఒక్కో సీటును ఎన్డీయే గెలుచుకుంటుందని టైమ్స్ నౌ - వీఎంఆర్ ఒపీనియన్ సర్వే అంచనా వేసింది.

More Telugu News