13 కోట్లతో ఇంకో ఇల్లు కొనేసిన అలియా భట్
- యూత్ లో అలియా భట్ కి మంచి క్రేజ్
- గతంలో రెండు ఇళ్లు కొన్న అలియా
- రణ్ బీర్ కపూర్ ఇంటికి దగ్గర్లో మరొకటి
కెరియర్ తొలినాళ్లలోనే యూత్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఆమె, తన సంపాదనతో ఆల్రెడీ ముంబైలో రెండు ఇళ్లు కొనేసింది. తాజాగా ముంబై .. జుహూ ఏరియాలో మరో ఇల్లు కొనుగోలు చేసింది .. ఈ ఇంటి కోసం ఆమె ఖర్చు చేసిన మొత్తం 13 కోట్లు. ఈ నెల 9వ తేదీన ఆమె ఆ ఇంటిని తన పేరుమీద రిజిస్టర్ చేయించుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆమె కొనుగోలు చేసిన ఇల్లు రణబీర్ కపూర్ ఇంటికి చాలా దగ్గర. వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారనే టాక్ కొన్ని రోజులుగా బాలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. రణ్ బీర్ కపూర్ ఇంటికి దగ్గరలో ఉండాలనే ఉద్దేశంతోనే ఆమె ఇంతమొత్తం ఖర్చు చేసి ఈ ఇల్లు కొనేసిందని చెప్పుకుంటున్నారు.