hyderabad: హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలో అగ్నిప్రమాదం

  • కాసామియా ఫుడ్ కోర్టులో అగ్నిప్రమాదం
  • గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ప్రమాదం సంభవించిందని భావిస్తున్న స్థానికులు
  • మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
హైదరాబాద్ మాదాపూర్ లో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక అయ్యప్ప సొసైటీలో ఉన్న కాసామియా ఫుడ్ కోర్టులో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. గ్యాస్ సిలిండర్లు పేలడం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని, మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. మరోవైపు, మంటలు తమ కట్టడాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉందని చుట్టుపక్కల వారు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. మంటలు చెలరేగిన వెంటనే అక్కడ పని చేస్తున్నవారు సురక్షితంగా బయటపడ్డారు.
hyderabad
madhapur
ayyappa society
Fire Accident
kasamia food court

More Telugu News