Andhra Pradesh: నేడు ప్రణయ్-అమృతల పెళ్లి రోజు.. ఫేస్ బుక్ లో స్పందించిన అమృత!

  • పెళ్లయి ఏడాది గడిచిందన్న అమృత
  • ప్రణయ్ ను బాగా మిస్ అవుతున్నట్లు వ్యాఖ్య
  • చిన్నారి కోసం ఆత్రుతగా చూస్తున్నట్లు పోస్ట్
తెలంగాణలోని మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ ను సొంత మామ మారుతీరావు కిరాయి గుండాలతో కిరాతకంగా చంపించిన సంగతి తెలిసిందే. దీంతో మారుతీరావుతో పాటు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు ప్రణయ్-అమృతల పెళ్లి రోజు. ఈ నేపథ్యంలో ఆమె ఫేస్ బుక్ లో స్పందించారు. ‘నీకు(ప్రణయ్) మన పెళ్లిరోజు శుభాకాంక్షలు. మన వివాహమై నేటికి ఏడాది గడిచింది.

గతేడాది ఇదే రోజున నిన్ను కలుసుకునేందుకు, నీ చేతిని పట్టుకుని నడిచేందుకు ఆత్రుతగా ఎదురుచూశాను. ఇప్పుడు మన చిన్నారిని ఎత్తుకునేందుకు ఎదురుచూస్తున్నా. ఈ కోరిక త్వరలోనే నెరవేరుతుందని ఆశిస్తున్నా. లవ్ యూ.. నిన్ను చాలా మిస్ అవుతున్నా’ అని జస్టిస్ ఫర్ ప్రణయ్ ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు.
Andhra Pradesh
Telangana
pranay
amruta
Facebook
justice for pranay

More Telugu News