Chandrababu: కేంద్రం ప్రకటించిన కరవు సాయాన్ని రాష్ట్ర దొంగల బారిన పడకుండా ప్రజలే చూడాలి: జీవీఎల్

  • కేంద్రం ఇచ్చిన నిధులతోనే దొంగ దీక్షలు
  • మాణిక్యాలరావు లాంటి ఎమ్మెల్యే ఉండటం అదృష్టం
  • ఏపీపై కేంద్రం గట్టి నిఘా ఏర్పాటు
కేంద్రం ప్రకటించిన రూ.900 కోట్ల కరవు సాయం ఏపీ రాష్ట్ర దొంగల బారిన పడనివ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలదేనని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు పేర్కొన్నారు. ఈ నిధులను పక్కదారి పట్టనివ్వకుండా ఏపీపై కేంద్రం గట్టి నిఘా ఏర్పాటు చేసిందన్నారు.

నేడు ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు క్యాంపు కార్యాలయంలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న జీవీఎల్ మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు దొంగ దీక్షలు చేపడుతున్నారని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే దొంగదీక్షలు చేస్తున్నారని జీవీఎల్ ఆరోపించారు. దోచుకుతినే ఎమ్మెల్యేలున్న రాష్ట్రంలో మాణిక్యాలరావు లాంటి ఎమ్మెల్యే ఉండటం అదృష్టమన్నారు. మిలటరీ మాధవరం గ్రామం కోసం మాణిక్యాలరావు రూ.11 కోట్ల నిధులను తీసుకురావటం గొప్ప విషయమని ప్రశంసించారు.
Chandrababu
Manikyala Rao
GVL Narasimha Rao
Military Madhavaram

More Telugu News