నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేనలో చేరిన పలువురు నేతలు
- జనసేనలోకి ఊపందుకుంటున్న చేరికలు
- జనసేనలో చేరిన గుంటూరు, నూజివీడు, అగిరిపల్లిలకు చెందిన నేతలు
- ప్రజాసేవ చేసేవారికి జనసేన మంచి వేదిక అన్న మనోహర్
ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ, ప్రజల కోసం పని చేసేవారికి జనసేన మంచి వేదిక అని చెప్పారు. పార్టీ బలోపేతానికి అందరూ కష్టపడి పని చేయాలని సూచించారు. మార్పు కోసం జనసేన పోరాడుతుందని, జనసేనతోనే సామాజిక మార్పు సాధ్యమని చెప్పారు. రాష్ట్ర ప్రజల నుంచి జనసేనకు మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు.