ఎయిరిండియా రిపబ్లిక్ డే ఆఫర్.. రూ.979కే టికెట్!
- రూ. 55 వేలకే అమెరికా ప్రయాణం
- రూ. 11 వేలకే ఆసియా దేశాలకు..
- ఈ నెల 28 వరకు టికెట్ల విక్రయం
దేశీయంగా ఎకానమీ క్లాస్‌లో ఒకవైపు ప్రయాణానికి అన్ని పన్నులు కలుపుకుని రూ. 979కి ప్రారంభం కానుండగా, బిజినెస్ క్లాస్ టికెట్ ధర రూ. 6,965 వరకు ఉంటుందని ఎయిరిండియా పేర్కొంది. అలాగే, అంతర్జాతీయ ప్రయాణాలకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ఎకానమీ క్లాస్‌లో రూ. 55 వేలకే అమెరికాకు వెళ్లే అవకాశం కల్పిస్తున్నట్టు ఎయిరిండియా అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. యూకే, యూరప్ సెక్టార్లకు రూ. 32 వేలు, ఆస్ట్రేలియాకు ఎకానమీ క్లాస్‌లో రూ. 50 వేలకే టికెట్లు ఆఫర్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. తూర్పు, దక్షిణ ఆసియా ప్రాంతంలోని దేశాలకు రూ.11వేలకు టికెట్ల ధరలున్నాయని.. ఈ ఆఫర్‌ను వినియోగించుకోవాలని కోరారు.