YSRCP: జగన్‌పై దాడి కేసులో ఎన్ఐఏపై కోర్టు ధిక్కారణ కేసు

  • న్యాయవాది లేకుండా విచారణ
  • పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు
  • ఫోన్ నంబర్లు ఇవ్వకపోవడంతో సంప్రదించలేదు

కోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తూ న్యాయవాది లేకుండానే ముప్పై గంటలపాటు విచారించారంటూ వైసీపీ అధినేత జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావు తరపు న్యాయవాది కోర్టులో పిటిషన్ వేశారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఆయన వేసిన పిటిషన్‌ను నేడు కోర్టు విచారణకు స్వీకరించింది.

న్యాయవాది లేకుండా నిందితుడిని విచారించడం కోర్టు ఉల్లంఘన కిందకే వస్తుందని న్యాయవాది తెలిపారు. అయితే నిందితుడి తరపు న్యాయవాదులు తమ పేర్ల కింద ఫోన్ నంబర్లు ఇవ్వకపోవడంతో తాము సంప్రదించలేకపోయామని ఎన్ఐఏ వివరణ ఇచ్చింది.

More Telugu News