UPA: కాంగ్రెస్ తో వారు జత కలిస్తే... అధికారానికి ఎన్డీయే దూరమే!

  • మాయవతి, అఖిలేష్, మమతా బెనర్జీ కలిసిరావాలి
  • అప్పుడు యూపీఏకు 269 సీట్లు, ఎన్డీయేకు 219 సీట్లు
  • వెల్లడించిన ఇండియా టుడే- కార్వీ ఇన్‌సైట్స్‌ సర్వే

  నిన్న జాతీయ స్థాయిలో విడుదలైన సర్వేలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకు తెరలేపాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలోని యూపీఏ కూటమితో సమాజ్ వాదీ నేత అఖిలేశ్‌ యాదవ్‌, బీఎస్పీ అధినేత్రి మాయావతి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ చేతులు కలిపితే... ఎన్డీయే అధికారానికి దూరమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, గడచిన లోక్ సభ ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక స్థానాలున్న యూపీలో దాదాపు క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ, భారీగా నష్టపోనుందని ఇండియా టుడే- కార్వీ ఇన్‌సైట్స్‌ నిర్వహించిన ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ పోల్‌’ వెల్లడించింది.

ఇదే సమయంలో వెల్లడైన రిపబ్లిక్ - సీ ఓటర్ సర్వే కూడా దాదాపు ఇదే విధమైన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగి, కాంగ్రెస్ తో ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలు కలిస్తే, యూపీఏకు 269 సీట్లు, ఎన్డీఏకు 219 సీట్లు వస్తాయని, ఇతరులు 55 సీట్ల వరకూ గెలుచుకుంటారని అంచనా వేసింది. యూపీఏకు 44 శాతం, ఎన్డీఏకు 35 శాతం, ఇతరులకు 21 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించింది. కాంగ్రెస్ తో ముగ్గురు నేతలూ కలిస్తే, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ అయిన 272కు అతి దగ్గరకు యూపీఏ వస్తుందని విశ్లేషించింది. ప్రధాని పదవికి నరేంద్ర మోదీ దూరం కావాల్సి రావచ్చని అంచనా వేసింది. 

More Telugu News