vijay devarakonda: బైక్ చుట్టూ తిరిగే కథలో విజయ్ దేవరకొండ

  • 'డియర్ కామ్రేడ్'తో బిజీగా విజయ్ దేవరకొండ
  • తదుపరి సినిమా క్రాంతిమాధవ్ తో 
  • తమిళ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్  

తెలుగులోని యువ కథానాయకులలో విజయ్ దేవరకొండకి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఆయన 'డియర్ కామ్రేడ్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన కేఎస్ రామారావు నిర్మాణంలో .. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ ప్రాజెక్టు తరువాత విజయ్ దేవరకొండ ఓ తమిళ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇటీవల ఆ దర్శకుడు విజయ్ దేవరకొండకి ఒక కథ వినిపించాడట. బైక్ చుట్టూ తిరిగే ఆ కథ ఎంతో ఆసక్తికరంగా ఉండటంతో వెంటనే విజయ్ దేవరకొండ ఓకే చెప్పేశాడని చెబుతున్నారు. కారు చుట్టూ తిరిగే కథతో 'టాక్సీవాలా'గా హిట్ కొట్టేసిన విజయ్ దేవరకొండ, బైక్ చుట్టూ తిరిగే కథతోను రానున్నాడన్న మాట. ఈ సినిమా తరువాత మైత్రీ మూవీ మేకర్స్ వారి బ్యానర్లో ఒక సినిమా ఉండొచ్చని అంటున్నారు.  ఈ సినిమాకి కొరటాల దర్శకుడిగా వ్యవహరించే అవకాశాలు ఎక్కువనే టాక్ వినిపిస్తోంది.

More Telugu News