Madhya Pradesh: మాకు మంత్రి పదవులు ఇస్తారా.. చస్తారా?: సీఎం కమల్‌నాథ్‌కు బీఎస్పీ హెచ్చరిక

  • కర్ణాటకలో ఏమవుతుందో చూస్తున్నారుగా
  • రాష్ట్రంలో పార్టీ బలంగా ఉండాలంటే మాకు పదవులు ఇవ్వాల్సిందే
  • తేల్చి చెప్పిన బీఎస్పీ ఎమ్మెల్యే రమాబాయి

మధ్యప్రదేశ్‌ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతిస్తున్న బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ ను బెదిరిస్తోంది. తమ ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వకుంటే కర్ణాటక లాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. కర్ణాటకలోని ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. దీంతో హైడ్రామా నడిచింది. ఒకానొక దశలో ప్రభుత్వం కూలిపోయి బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందన్న వార్తలు కూడా వచ్చాయి.  అయితే, ఆ తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయి.

తాజాగా మధ్యప్రదేశ్ బీఎస్పీ ఎమ్మెల్యే రమాబాయి అహిర్వార్ మాట్లాడుతూ.. బీఎస్పీ ఎమ్మెల్యేలు ఇద్దరికీ మంత్రి పదవులు ఇవ్వాల్సిందేనన్నారు. తమకు పదవులు ఇవ్వకుంటే మిగతా వారు కూడా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తారని అన్నారు. అందరినీ సంతోషపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ బలంగా ఉండాలని సీఎం కమల్‌నాథ్ కనుక కోరుకుంటే తొలుత తాము బలంగా ఉండాలని, అందుకోసం తమకు మంత్రి పదవులు ఇవ్వాలని రమాబాయి తేల్చిచెప్పారు. మంత్రి పదవులు ఇవ్వకుంటే కనుక కర్ణాటక లాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

More Telugu News