darshan: మైనస్ 2 డిగ్రీల చలిలో రష్మికపై సాంగ్ చిత్రీకరణ

షార్ట్స్‌లో చూడండి
తెలుగులో రష్మిక చేసిన 'ఛలో' .. 'గీత గోవిందం' సినిమాలు విజయాలను అందుకున్నాయి. దాంతో ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇక కన్నడలోను ఆమె జోరు కొనసాగుతోంది. కన్నడలో ఆమె 'దర్శన్' జోడీగా 'యజమాన' సినిమా చేస్తోంది. ఇటీవల 'స్వీడన్'లో మైనస్ 2 డిగ్రీల చలిలో దర్శన్ .. రష్మిక జంటపై ఒక పాటను చిత్రీకరించారట.

విపరీతమైన మంచులో చలిని తట్టుకుంటూ .. ప్రేమ భావనలకు సంబంధించిన ఎక్స్ ప్రెషన్స్ రష్మిక అద్భుతంగా ఇవ్వడం యూనిట్ ని ఆశ్చర్య చకితులను చేసిందట. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో రష్మికనే చెప్పింది. శ్రేయ ఘోషల్ .. సోను నిగమ్ పాడిన ఈ పాట, ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుందని అంది. ఈ మెలోడీ సాంగ్ కి రెండు రోజుల్లో దాదాపు 4 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. ఈ సినిమా హిట్ అయితే కన్నడలో రష్మిక మరింత బిజీకావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   
Go Back to Shorts
darshan
rashmika

More Telugu News