ఓటు వేసేందుకు వెళ్లి ఇంటికి తిరిగిరాని యువతి!
Add ap7am to your home Screen

ఓటు వేసేందుకు వెళ్లి ఇంటికి తిరిగిరాని యువతి!

  • సోమవారం నాడు పంచాయతీ ఎన్నికలు
  • స్కూల్ లో పని చేస్తున్న జయశ్రీ
  • ఇంటికి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు
రెండు రోజుల క్రితం తెలంగాణలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లిన ఓ యువతి అదృశ్యం కావడం కీసరలో తీవ్ర కలకలం రేపింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, చీర్యాల సమీపంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన జయశ్రీ అనే మహిళ, 'దిశ' పాఠశాలలో కేర్ టేకర్. సోమవారం నాడు ఓటు వేస్తానని వెళ్లిన ఆమె మళ్లీ ఇంటికి చేరలేదు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆమె భర్త రాజు, మంగళవారం నాడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. ఆమె ఎక్కడికి వెళ్లిందన్న విషయాన్ని తేల్చేందుకు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 
Telangana
Missing
Kesara
Vote

More Telugu News