Yadadri Bhuvanagiri District: వివాహమైన నెల రోజులకే నవ వధువు ఆత్మహత్య

  • విక్రమ్‌కు మానసతో వివాహం
  • ఉరి వేసుకుని ఆత్మహత్య
  • కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
వివాహమైన నెల రోజులకే ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. హైదరాబాద్ శంకర్‌పల్లికి చెందిన విక్రమ్‌కు ఆలేరు మండలం కొల్లూరు గ్రామానికి చెందిన మానసతో నెల రోజుల క్రితమే వివాహం జరిగింది. నేడు మానస ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతోనే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని.. కట్న కానుకల కోసం పెళ్లినాటి నుంచే అత్తింటి వారు వేధించారని మృతురాలి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Yadadri Bhuvanagiri District
Vikram
Manasa
Hyderabad
Suicide
Police

More Telugu News