Chandrababu: రాహుల్ గాంధీతో భేటీ అయిన చంద్రబాబు

  • బీజేపీయేతర పక్షాల బహిరంగసభలపై చర్చించనున్న నేతలు
  • ఏపీలో పొత్తు విషయం కూడా చర్చకు వచ్చే అవకాశం
  • ధర్మపోరాట దీక్షకు రాహుల్ ను ఆహ్వానించనున్న చంద్రబాబు
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. బీజేపీయేతర పక్షాల బహిరంగసభలపై వీరు చర్చించనున్నారు. దీంతో పాటు ఏపీలో కాంగ్రెస్, టీడీపీ పొత్తు విషయం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అమరావతిలో నిర్వహించనున్న ధర్మపోరాట దీక్షకు రాహుల్ ను ఈ సందర్భంగా చంద్రబాబు ఆహ్వానించనున్నారు. బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటులో చంద్రబాబు కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, రాహుల్ తో బాబు భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
Chandrababu
Rahul Gandhi
delhi
meet
Telugudesam
congress

More Telugu News