Hyderabad: పట్టపగలే విజృంభించిన దొంగలు.. రూ.4 లక్షల నగదు, 18 తులాల బంగారం అపహరణ

  • రాజేంద్రనగర్‌లో నివాసముంటున్న మహేశ్వర్
  • తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు
  • విచారణ ప్రారంభించిన పోలీసులు
హైదరాబాద్ నగర శివారులో దొంగలు పట్టపగలే దోపిడీకి పాల్పడ్డారు. రాజేంద్రనగర్‌లోని ఎన్ఎమ్ గూడాలోని హుడా పార్క్ వద్ద మహేశ్వర్ అనే వ్యాపారస్తుడు నివసిస్తున్నారు. నేటి మధ్యాహ్నం మహేశ్వర్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు.. బీరువాను పగులగొట్టి రూ.4 లక్షల నగదు, 18 తులాల బంగారం దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.
Hyderabad
Theft
Rajendranagar
Maheshwar
Police

More Telugu News