Hyderabad: మూసీనదిలో గుర్తు తెలియని మృత దేహాలు.. క్షుద్ర పూజలు జరిగి ఉండవచ్చని అనుమానం!

  • మృతదేహాలను గుర్తించిన స్థానికులు
  • కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
  • మృతదేహాలను గుర్తించేందుకు యత్నం
హైదరాబాద్‌లోని లంగర్ హౌస్ వద్ద మూసీనదిలో ఇద్దరు గుర్తు తెలియని మహిళల మృతదేహాలు బయటపడటం కలకలం రేపుతోంది. క్షుద్రపూజలు జరిగి ఉండవచ్చనే అనుమానాలు తలెత్తడంతో మరింత సంచలనంగా మారింది. మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ముందుగా మృతదేహాలను గుర్తించేందుకు యత్నిస్తున్నారు. అయితే నిన్న పౌర్ణమి కావడంతో క్షుద్ర పూజలు జరిగి ఉండొచ్చనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.
Hyderabad
Musi River
Lunger House
Dead Bodies

More Telugu News