China: సముద్రంలో తగులబడ్డ నౌకలు... భారతీయులు సహా 11 మంది మృతి!

  • చైనా, రష్యాల జలసంధి మధ్య ఘటన
  • నౌకల మధ్య ఇంధనం సరఫరా అవుతున్న వేళ మంటలు
  • 12 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్

చైనా, రష్యాలను విడదీసే క్రెచ్ స్ట్రెయిట్ జలసంధిలో రెండు నౌకలు తగులబడటంతో 11 మంది మరణించారు. రష్యా జలాల్లో ఈ ఘటన జరిగింది. నౌకల్లో భారతీయులతో పాటు టర్కి, లిబియా పౌరులు ఉన్నారు. ఈ రెండు నౌకలపైనా టాంజానియా జెండాలు ఉన్నాయని, వీటిల్లో ఒకటి లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్ ను తరలిస్తుండగా, మరొకటి ట్యాంకర్ అని, రెండు నౌకల మధ్యా ఇంధన సరఫరా జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ప్రాధమిక సమాచారం.

'దీ క్యాండీ' అనే పేరున్న గ్యాస్ తరలించే నౌకలో 8 మంది భారత పౌరులు, 9 మంది టర్కీ పౌరులు సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్నారు. 'ది మ్యాస్ట్రో' అనే పేరున్న రెండో నౌకలో ఏడుగురు టర్కీ జాతీయులు, ఏడుగురు భారతీయులు, ఒక లిబియా పౌరుడు ఉన్నారని రష్యా న్యూస్ ఏజన్సీ ఒకటి తెలిపింది. మరణించిన వారు ఎవరెవరన్న విషయం ఇంకా నిర్ధారణకు రాలేదు.

తొలుత ఒక నౌకకు నిప్పంటుకోగా, ఆ వెంటనే రెండో నౌకకు మంటలు వ్యాపించాయని, కొంతమంది సెయిలర్లు ఆ వెంటనే సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారని రష్యన్ టెలివిజన్ నెట్ వర్క్ ఆర్టీ న్యూస్ వెల్లడించింది. విషయం తెలుసుకున్న రెస్క్యూ టీమ్ సభ్యులు అక్కడికి చేరుకుని 12 మందిని రక్షించాయని తెలిపింది. 

More Telugu News