Australian open: ఆస్ట్రేలియన్ ఓపెన్.. ప్రీక్వార్టర్స్ లో నెగ్గిన సెరీనా విలియమ్స్

  • టాప్ సీడ్ క్రీడాకారిణి నిమోనా హలెప్ పై విజయం
  • 6-1, 4-6, 6-4 స్కోర్ తేడాతో సెరీనా గెలుపు
  • ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఇప్పటికే 7 సార్లు విజేత సెరీనా

ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో టెన్నిస్ దిగ్గజం సెరీనా విలియమ్స్ ప్రీ క్వార్టర్స్ లో నెగ్గింది. రొమేనియాకు చెందిన టాప్ సీడ్ క్రీడాకారిణి నిమోనా హలెప్ పై విజయం సాధించింది. సిమోనాపై 6-1, 4-6, 6-4 స్కోర్ తేడాతో గెలుపొందిన సెరీనా, క్వార్టర్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. తొలి సెట్ ను కేవలం ఇరవై నిమిషాల్లో కైవసం చేసుకోగా, రెండో సెట్ ను సిమోనా దక్కించుకుంది.

దీంతో, మూడో సెట్ ఎవరు గెలుస్తారోనన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. ఓ దశలో 3-3 తో సమానంగా ఉన్న సమయంలో, సెరీనా మూడు బ్రేక్ పాయింట్లు సేవ్ చేసుకుని మ్యాచ్ పై పట్టు సాధించి, ఆపై ఆ సెట్ ను కైవసం చేసుకుంది. కాగా, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తీసుకున్న గ్యాప్ అనంతరం సెరీనా తొలిసారి రాకెట్ పట్టుకుంది. ఇప్పటికే 7 సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సెరీనా విజయం సాధించింది. 24వ గ్రాండ్ స్లామ్ ను సాధించేందుకు సెరీనా ఉవ్విళ్లూరుతుండటం గమనార్హం.  

More Telugu News