Jagan: ‘జగన్ పై దాడి’ కేసులో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ.. ఎన్ఐఏ విచారణపై స్టేకు నిరాకరించిన హైకోర్టు!

  • మేం నిందితుడిని విచారించడం జరిగింది 
  • విచారణను దాదాపుగా పూర్తిచేశామన్న ప్రభుత్వం
  • కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశం

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ పై దాడి కేసులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ వ్యవహారంలో ఎన్ఐఏ దర్యాప్తును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ.. జగన్ పై దాడి కేసులో ఏపీ సిట్ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారని, కేసు విచారణ దాదాపుగా పూర్తి చేశారనీ, ఇలాంటి సమయంలో ఎన్ఐఏకు కేసును అప్పగించడం సరికాదని వాదించారు.

ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఎన్ఐఏ విచారణపై స్టే విధించేందుకు నిరాకరించింది. ఈ వ్యవహారంలో జనవరి 30లోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన కీలక ఫైళ్లను తమకు అందజేయాలని ఎన్ఐఏ అధికారులకు సూచించారు.

కాగా, గతేడాది అక్టోబర్ 25న విశాఖ ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు అనే యువకుడు జగన్ పై కోడి కత్తితో దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో లోతైన గాయం కావడంతో జగన్ హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు.

More Telugu News