రంగా కుటుంబాన్ని జగన్ మోసం చేశారు: మండిపడిన రాధా-రంగా మిత్రమండలి
- వైసీపీకి వంగవీటి రాధా రాజీనామా
- రాధాను వదులుకుని జగన్ పెద్ద తప్పే చేస్తున్నారని విమర్శ
- రాధా వెంటే ఉంటామన్న కార్పొరేటర్లు
కాగా, గత కొంతకాలంగా పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్న రాధాకృష్ణ ఆదివారం వైసీపీకి రాజీనామా ప్రకటించి కలకలం రేపారు. రాజీనామా లేఖను పార్టీ చీఫ్ జగన్‌కు పంపారు. విజయవాడ సెంట్రల్ టికెట్ విషయంలోనే అధినేతతో ఆయనకు విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా, అభిమానులతో చర్చించి మరో రెండు రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణను వివరిస్తానని రాధా తెలిపారు.