tollywood: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీసిన రాజాసింగ్

  • డ్రగ్స్ కేసు విచారణ అర్థాంతరంగా ఎందుకు ఆగిపోయింది?
  • ఉస్మానియా ఆసుపత్రిలో డాక్టర్లు హెల్మెట్లు పెట్టుకుని తిరుగుతున్నారు
  • కంటి వెలుగు పథకం కింద ఎంతమందికి ఆపరేషన్ చేశారు?

టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనాన్ని రేకెత్తించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ఆ కేసు ఏమైందో ఎవరికీ తెలియదు. ఇదే అంశాన్ని తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ లేవనెత్తారు. డ్రగ్స్ కేసు ఏమైందని, కేసు విచారణ అర్థాంతరంగా ఎందుకు ఆగిపోయిందని ఆయన ప్రశ్నించారు. క్రికెట్ బెట్టింగ్ ను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని కోరారు. కంటి వెలుగు పథకం మంచిదేనని.... అయితే ఇప్పటి వరకు ఎంతమందికి శస్త్ర చికిత్సలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఉస్మానియా ఆసుపత్రి భవనం ప్రమాదకరంగా ఉందని... కొత్త ఆసుపత్రిని నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వ హామీ ఏమైందని రాజాసింగ్ ప్రశ్నించారు. ఉస్మానియాలో వైద్యులు హెల్మెట్లు పెట్టుకుని తిరిగే పరిస్థితి నెలకొందని అన్నారు. కొంత మంది ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి వెళ్లిపోతున్నారని... అలాంటి పార్టీకి అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సరైన గుణపాఠం చెప్పారని పరోక్షంగా ఎంఐఎంపై విమర్శలు గుప్పించారు.

More Telugu News