ఆంధ్రప్రదేశ్ కు మరో కీలక సంస్థ.. కడియంలో జాతీయ పూల పరిశోధనా కేంద్రం ఏర్పాటు!
- జిల్లాలోని వేమగిరిలో స్థలం కేటాయించిన ప్రభుత్వం
- ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు రూ.5 కోట్ల వ్యయం
- వివరాలు వెల్లడించిన టీడీపీ నేత మురళీమోహన్
రాజమండ్రిలో ఈరోజు ఓ కార్యక్రమం సందర్భంగా మురళీ మోహన్ మీడియాతో మాట్లాడుతూ.. కడియం సమీపంలోని వేమగిరిలో 10.77 ఎకరాల్లో రూ.5 కోట్ల వ్యయంతో ఈ ప్రాంతీయ కేంద్రాన్నిఏర్పాటు చేస్తామని అన్నారు. కడియం వంగడాలను ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లోనూ అభివృద్ధి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. త్వరలోనే రాజమండ్రి (రాజమహేంద్రవరం) విమానాశ్రయం నుంచి కార్గో సేవలు కూడా ప్రారంభం అవుతాయని ఆయన తెలిపారు.