movie artist association: ఒక్కసారి ‘మా’ అధ్యక్షుడిగా పని చేస్తే చాలనుకుంటున్నా: సీనియర్ నరేష్

  • త్వరలో ‘మా’ ఎన్నికలు జరగనున్నాయి
  • అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆనవాయతీ
  • అలా జరగని పక్షంలో ఎన్నికల బరిలోకి దిగుతా

మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా ఒక్కసారి తాను పని చేస్తే చాలని, ఇక, ఆ పదవి వైపు చూడనని సీనియర్ నటుడు నరేష్ అన్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, త్వరలో ‘మా’ ఎన్నికలు జరగనున్నాయని చెబుతూ, అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆనవాయతీగా వస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.

 ‘మా’ అధ్యక్ష పదవిలో ఎవరు పనిచేసినా ఒక పర్యాయం మాత్రమే ఆ పదవిలో ఉండాలని తమలో తాము అనుకున్నట్టు చెప్పారు. అధ్యక్షుడిని ఎన్నుకోవడం ఏకగ్రీవం కాని పక్షంలో ఎన్నికల బరిలో దిగడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ‘మా’ అధ్యక్షుడిగా తాను చేయాలనుకుంటున్నది ఆ పదవిపై వ్యామోహంతో కాదని, ధర్మాన్ని రక్షించేందుకని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

More Telugu News