‘జాన్ విక్ చాప్టర్ 3’ ట్రైలర్ విడుదల.. యాక్షన్ తో అదరగొట్టిన కీనూ రీవ్స్!

- ఘనవిజయం సాధించిన రెండు సినిమాలు
- చిత్రాన్ని తెరకెక్కించిన చాడ్ ష్టాహెల్క్సీ
- మే 17న విడుదలకు నిర్మాతల సన్నాహాలు
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో రహస్యంగా ఓ మాఫియా తన కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటుంది. అయితే ఈ గ్యాంగ్ కు ఉన్న సేఫ్ హౌస్ లలో తోటి సహచరులను, శత్రువులను చంపకూడదని నిబంధన ఉంటుంది. ఈ ముఠాలో హిట్ మెన్ గా పనిచేస్తున్న జాన్ విక్(కీనూ రీవ్స్).. తన ఇంటిపై దాడిచేసిన సొంత గ్యాంగ్ సభ్యుడిని సేఫ్ హౌస్ లో చంపేస్తాడు. దీంతో జాన్ విక్ ను చంపేందుకు ఆ ముఠా మొత్తం ఒక్కటి అయిపోతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో జాన్ విక్ తన ప్రాణాలను ఎలా కాపాడుకున్నాడు? చివరికి తప్పించుకోగలిగాడా? అనే ఇతివృత్తంతో సినిమా సాగనుంది. ఈ ఏడాది మే 17న సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. హైఎండ్ యాక్షన్ సీన్లు ఉన్న ఈ ట్రైలర్ ను మీరూ చూసేయండి.