Andhra Pradesh: విచారణ సంస్థలనే అనుకున్నా.. ఏపీ నుంచి వ్యక్తులను కూడా బహిష్కరించడానికి యత్నిస్తున్నారు!: ఐవైఆర్ ఆగ్రహం

  • మీడియాతో అనుకూల వాతావరణం సృష్టిస్తున్నారు
  • ట్విట్టర్ లో స్పందించిన ఏపీ మాజీ ప్రధాన కార్యదర్శి
  • తెలుగు పేపర్ క్లిప్పింగ్ ను జతచేసిన మాజీ ఐఏఎస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఏపీ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. ఇంతవరకూ ఏపీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను మాత్రమే బహిష్కరిస్తుందని తాను భావించానని, కానీ ఇప్పుడు వ్యక్తులను కూడా బహిష్కరించడానికి అనుకూల మీడియా సాయంతో అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నట్టు కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వైసీపీ అధినేత జగన్ భేటీపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన ఈ మేరకు స్పందించారు.

ఈరోజు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో ఐవైఆర్ స్పందిస్తూ..‘ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం బహిష్కరణ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల వరకే అనుకున్నాను. ఇప్పుడు వ్యక్తులను కూడా బహిష్కరించడానికి అనుకూల మీడియా సహాయంతో వాతావరణాన్ని సృష్టిస్తున్నట్టు కనిపిస్తున్నది’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు ఓ తెలుగు దినపత్రిక క్లిప్పింగ్ ను ఐవైఆర్ జతచేశారు.


More Telugu News