ఎవరైనా నేడు ఎన్టీఆర్ పథకాలను కాపీ కొట్టే వాళ్లే!: ఎన్టీఆర్ ఘాట్ లో బాలకృష్ణ

18-01-2019 Fri 08:27
  • అందరూ మహానుభావులు కాలేరు
  • ఆయన పథకాలను కాపీకొట్టి పరిపాలిస్తున్నారు
  • ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా బాలయ్య నివాళులు

"ఈ భూమి మీద ఎందరో పుడతారు, గిడతారు కానీ, అందరూ మహానుభావులు కాలేరు. ఒక మనిషి మహోన్నత శిఖరాలకు ఎదగాలంటే, అత్తున్నత విజయపథంలో నడవాలంటే, సత్సంకల్పం ఉండాలి. దీక్ష పూనాలి... ఆయనెప్పుడూ ఒక స్ఫూర్తి. ఒక ఆదర్శం. ఏవైతే ఆనాడు పథకాలన్నీ ప్రవేశపెట్టారో... ఎంతో ముందుచూపుతో విప్లవాత్మకమైన పథకాలన్నీ... ఇవాళ ఏ పార్టీ ముందుకొచ్చినా, ఏ నాయకుడు ముందుకొచ్చి గొంతు చించుకున్నా, అవన్నీ ఆయన ప్రవేశపెట్టిన పథకాలను కాపీకొట్టి పరిపాలన సాగించినోడే అన్న విషయం మనం మరచిపోకూడదు" అని హీరో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. నేడు ఎన్టీఆర్ 23వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్, హుసేన్ సాగర్ తీరాన ఉన్న ఎన్టీఆర్ ఘాట్ లో బాలయ్య నివాళులు అర్పించారు. అంతకుముందు హీరో ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ కుటుంబీకులు తదితరులు నివాళులు అర్పించారు.