Brahmanandam: మా నాన్న ఆరోగ్యం మెరుగ్గా ఉంది: బ్రహ్మానందం కుమారుడు గౌతమ్

  • గుండె ఆపరేషన్‌ విజయవంతంగా చేశారు
  • ప్రముఖ వైద్యుడు రమాకాంత్ పాండా ఆపరేషన్ చేశారు
  • అందరి ఆశీస్సుల వల్లే ఆరోగ్యం మెరుగైంది
ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడు బ్రహ్మానందంకు గుండె ఆపరేషన్ జరిగిందన్న విషయం తెలిసి ఆయన అభిమానులు, సన్నిహితులు కలవరపడ్డారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన తనయుడు హీరో గౌతమ్ తెలిపారు. కొన్ని నెలలుగా  ఛాతీలో అసౌకర్యంగా అనిపించడంతో హైదరాబాద్‌లోని ప్రముఖ డాక్టర్‌ని సంప్రదించారు బ్రహ్మానందం. వారి సలహా మేరకు శస్త్ర చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. దేశంలోనే అత్యుత్తమమైన ముంబైలోని ‘ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్'లో ఈ నెల 14న గుండె ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తయిందని,  ప్రముఖ హృదయ శస్త్రచికిత్స నిపుణులు రమాకాంత్ పాండా తన తండ్రికి సర్జరీ చేసినట్టు చెప్పారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఐసీయూ నుంచి సాధారణ గదికి మార్చటం జరిగిందని తెలిపారు. తన తండ్రికి శస్త్ర చికిత్స జరిగిందని తెలిసి అభిమానులు, శ్రేయోభిలాషులు, సినీ పరిశ్రమ లోని ప్రముఖులు అందరూ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేస్తున్నారని, అందరి ప్రేమాభిమానాలు, ఆశీస్సుల వల్ల  తన తండ్రి ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉందని చెబుతూ, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా, బ్రహ్మానందం కుమారులు రాజా గౌతమ్, సిద్దార్థ్‌లు, ఆయన కుటుంబసభ్యులు తండ్రితో పాటు ముంబైలో ఉన్నారు. 
Brahmanandam
Tollywood
open heart
mumbai

More Telugu News