Hyderabad: టీఆర్ఎస్ నేతపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు.. బీజేపీ నేత అరెస్ట్!

  • మైనంపల్లిపై తప్పుడు ప్రచారం
  • గత నెల 5న పోలీసులకు ఫిర్యాదు
  • బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయిప్రసాద్ అరెస్ట్
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.సాయిప్రసాద్ (38)ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో మల్కాజిగిరి టీఆర్ఎస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావుపై సాయిప్రసాద్ సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేశారు. ఫేక్ వీడియోలు పోస్టు చేసి వైరల్ చేశారు. సాయిప్రసాద్ తప్పుడు ప్రచారంపై నేరేడ్‌మెట్‌లోని మధురానగర్‌కు చెందిన సిరా రోహిత్ గత నెల 5న నేరేడ్‌మెట్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాయిప్రసాద్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Hyderabad
cyber crime police
Mynampally Hanumantha rao
Malkajgiri

More Telugu News