Trisha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

షార్ట్స్‌లో చూడండి
*  వయసు పెరుగుతున్నా కూడా డిమాండ్ ఏమాత్రం కోల్పోని కథానాయికగా త్రిషను చెప్పుకోవాలి. ఆమె తాజా చిత్రం 'పేట' మంచి హిట్టవడంతో త్రిషకు మరింత డిమాండ్ పెరిగింది. ఇప్పటికే ఆమె చేతిలో ఐదు సినిమాలు వుండగా, తాజాగా మరికొన్ని ఆఫర్లు వచ్చినట్టు, త్వరలో వాటికి కూడా ఆమె సంతకం చేయనున్నట్టు తెలుస్తోంది.
*  రవితేజ తన తదుపరి చిత్రాన్ని సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నాడు. మొదట్లో వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందే చిత్రాన్ని ముందుగా చేయాలనుకున్నప్పటికీ, కారణాంతరాల వల్ల సంతోష్ శ్రీనివాస్ ప్రాజక్ట్ ముందుకు వచ్చినట్టు సమాచారం. ఇందులో కేథరిన్ త్రెసా కథానాయికగా నటిస్తుంది.
*  బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం 'మహానాయకుడు' విడుదల వాయిదా పడచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఫిబ్రవరి 7న ఇది విడుదల కావాలి. అయితే, చిత్రం క్వాలిటీ పట్ల మరింత కేర్ తీసుకుంటున్న నేపథ్యంలో విడుదల వాయిదా పడచ్చని అంటున్నారు.  
Go Back to Shorts
Trisha
Raviteja
Catherin
Balakrishna

More Telugu News