L.Ramana: వైఎస్ కుటుంబాన్ని విమర్శించే కేసీఆర్‌కు జగన్ ఎలా దోస్త్ అయ్యారో?: ఎల్.రమణ సందేహం

  • నేడు బ్లాక్ డే
  • ఇరు పార్టీల ముసుగు నేటితో తొలగిపోయింది
  • జగన్ లంచగొండి అని కేసీఆరే చెప్పారు
వైసీపీ చీఫ్ జగన్-టీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కలయికపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సమయం దొరికితే వైఎస్ కుటుంబాన్ని విమర్శించే కేసీఆర్‌కు జగన్ ఎలా దోస్తయ్యాడబ్బా? అని సందేహం వెలిబుచ్చారు. ప్రజాస్వామ్యంలో నేడు బ్లాక్ డే అని పేర్కొన్నారు. వైసీపీ-టీఆర్ఎస్‌లు ఇన్నాళ్లు వేసుకున్న ముసుగు నేటితో తొలగిపోయిందన్నారు.

 కేసీఆర్ తన కుటుంబ రాజకీయ మనుగడ కోసం దేశంలోనే అతిపెద్ద లంచగొండి అయిన జగన్‌తో చేతులు కలిపారని ఆరోపించారు. జగన్ లంచగొండి అన్న విషయాన్ని కేసీఆరే స్వయంగా అన్నారని ఈ సందర్భంగా రమణ గుర్తుచేశారు. ఫెడరల్ ఫ్రంట్ ముసుగులో బీజేపీకి టీఆర్ఎస్, వైసీపీలు ‘బి’ టీములుగా పనిచేస్తున్నాయని రమణ ఆరోపించారు.
L.Ramana
Telugudesam
Jagan
KCR
YSRCP
TRS

More Telugu News