YSRCP: రాజశేఖర్‌రెడ్డిపై కక్షను టీఆర్ఎస్ ఇలా తీర్చుకుంటోందేమో!: తులసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

  • టీఆర్ఎస్‌ను తుడిచిపెట్టేయాలని వైఎస్ చూశారు
  • ఆయన బతికి ఉంటే అదే అయ్యేది
  • ఆ కక్ష తీర్చుకునేందుకు ఇప్పుడు జగన్‌తో పొత్తు
వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఉన్న కక్షను జగన్‌తో పొత్తుపెట్టుకోవడం ద్వారా టీఆర్ఎస్ తీర్చుకుంటోందన్న అనుమానం కలుగుతోందంటూ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో టీఆర్ఎస్‌ను నామరూపాల్లేకుండా చేయాలని వైఎస్ ప్రయత్నించారని అన్నారు. నిజానికి వైఎస్ బతికి ఉంటే అదే జరిగి ఉండేదన్నారు. ఆనాడు వైఎస్ చేసిన దానికి ప్రతీకారంగా నేడు ఆయన కుమారుడు వైఎస్ జగన్‌తో చేతులు కలిపి ఏపీలో ఆయన పార్టీని ఫినిష్ చేయాలని చూస్తున్నట్టు ఉందన్న సందేహాన్ని తులసిరెడ్డి వ్యక్తం చేశారు. ఓ చానల్ డిబేట్‌లో తులసిరెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
YSRCP
Jagan
YS Rajasehar reddy
TRS
KCR

More Telugu News