సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్న కర్ణాటక రాజకీయాలు.. అదృశ్యమైన ఎమ్మెల్యేలు ప్రత్యక్షం!
- ఉత్కంఠ రేపుతున్న కన్నడ రాజకీయం
- అదృశ్యమైన ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ముగ్గురు ముంబైలో
- కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదన్న ఖర్గే
కర్ణాటకకు తిరిగి వచ్చిన ఎమ్మెల్యేల్లో ఒకరైన భీమా నాయక్ మాట్లాడుతూ.. సీక్రెట్ ఫోన్ నంబరు ద్వారా బీజేపీ నేతలతో చర్చలు జరుపుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. అయితే, కనిపించకుండా పోయిన ఈ రెండు రోజులు ఎక్కడ ఉన్నారన్న విషయాన్ని మాత్రం ఆయన బయటపెట్టేందుకు నిరాకరించారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జ్ కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ ఎమ్మెల్యేలందరితోనూ టచ్‌లోనే ఉన్నామని, మరో రెండు రోజుల్లో పరిస్థితులు సద్దుమణుగుతాయని పేర్కొన్నారు. మరోవైపు ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు ఈ నెల 18న కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశానికి పిలుపునిచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదన్నారు.