sneha: అప్పుడు వద్దన్నా వినలేదు .. అందుకే యాక్సిడెంట్ అయింది!: హీరోయిన్ స్నేహ

  • తెల్లవారితే తిరుపతిలో షూటింగ్ 
  • ముందురోజు రాత్రే కార్లో బయలుదేరాము
  • నెల రోజుల పాటు బెడ్ పైనే వున్నాను

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో స్నేహ మాట్లాడుతూ, తనకి జరిగిన ఒక ప్రమాదాన్ని గురించి ప్రస్తావించారు. "ఒక సినిమా షూటింగును పూర్తి చేసిన నేను .. మరో సినిమా షూటింగు కోసం తిరుపతి వెళ్లవలసి వుంది. తెల్లవారితో షూటింగ్ .. అందువలన ముందురోజు రాత్రి కారులో తిరుపతి వెళ్లాలని నిర్ణయించుకున్నాను.

మా నాన్న .. అన్నయ్య ఇద్దరూ కూడా వద్దన్నారు. 'నా మనసేదో కీడు శంకిస్తోంది .. వెళ్లవద్దని మా అన్నయ్య మరీ చెప్పాడు. అయినా మా అమ్మను .. గ్రాండ్ మాను .. హెల్పర్ గర్ల్ ను వెంటబెట్టుకుని కారులో బయలుదేరాను. కొంతదూరం వెళ్లిన తరువాత కారు ప్రమాదానికి గురైంది. మిగతా వాళ్లెవరికీ ఏమీ కాలేదు .. నాకే గాయాలయ్యాయి. దాంతో నెల రోజుల పాటు బెడ్ పైనే వుండవలసి వచ్చింది. 6 నెలలపాటు నడవకూడదని చెప్పారు .. దేవుడి దయ వలన 2 నెలలలోనే నడిచాను" అని చెప్పుకొచ్చారు.

More Telugu News