East Godavari District: ఇది 'కోడి కుంభమేళా' అట... భీమవరం సమీపంలో బరుల ఏరియల్ వ్యూ!

  • జోరుగా సాగుతున్న కోడి పందాలు
  • చేతులు మారుతున్న వందల కోట్లు
  • డ్రోన్ కెమెరాతో బరుల దృశ్యాల చిత్రీకరణ

సంక్రాంతి పండగ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. కోడి పందాలు నిర్వహిస్తే చూస్తూ ఊరుకోబోమని పోలీసులు హెచ్చరించినా, ఎక్కడా పట్టించుకున్న దాఖలాలు లేవు. గడచిన రెండు రోజుల్లో భీమవరం, ఉండి, ఏలూరు, నరసాపురం, కాకినాడ, పిఠాపురం, ఆకివీడు తదితర ప్రాంతాల్లో జరిగిన పందాల్లో వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి.

ఇక్కడ కోడి పందాలు కాసేందుకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల నుంచి కూడా పందెం రాయుళ్లు వచ్చి మకాం వేశారు. ఇక భీమవరం సమీపంలో ఏర్పాటు చేసిన పందెం బరులకు సంబంధించిన ఏరియల్ వ్యూ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీన్ని ఎవరో డ్రోన్ కెమెరాతో చిత్రీకరించినట్టు ఫొటోను చూస్తేనే అర్థమవుతుంది. యూపీలోని ప్రయాగ్ రాజ్ లో కుంభమేళా, వైభవంగా ప్రారంభమైన వేళ, ఈ ఫొటోకు 'కోడి కుంభమేళా' అని ట్యాగ్ కూడా తగిలించారు.  

More Telugu News