Ankith: వార్మప్ చేస్తూ గుండెపోటుతో యువ క్రికెటర్ మృతి!

ఓ యువ క్రికెటర్ వార్మప్ సెషన్‌లో గుండెపోటుతో కుప్పకూలిన విషాద ఘటన కోల్‌కతాలో చోటు చేసుకుంది. స్థానిక పైక్ పారా స్పోర్ట్స్ క్లబ్ తరుపున క్రికెట్ ఆడుతున్న అంకిత్ శర్మ(21) నేడు మ్యాచ్ ప్రాక్టీస్‌లో భాగంగా.. వార్మప్ చేస్తుండగా.. గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే సహచరులు హుటాహుటిన సిటీ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అంకిత్ మృతి చెందినట్టు వైద్యులు స్పష్టం చేశారు.

ఈ విషయమై అంకిత్ కోచ్ మాట్లాడుతూ.. ‘అంకిత్ చాలా మంచి క్రికెటర్‌. గతేడాది ఈ క్లబ్‌‌లో చేరాడు. జట్టు సభ్యులతోనూ చక్కగా కలిసిపోతాడు. అంతేకాదు, మంచి ఫీల్డర్‌ కూడా. ఈ వార్త విని మేం షాకయ్యాం’ అని తెలిపారు. అంకిత్ మృతి పట్ల బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ అవిషేక్ దాల్మియా విచారం వ్యక్తం చేశారు.  
Ankith
Cricket
Avishek Dhalmia
Kolkatha

More Telugu News