శబరిమల అయ్యప్పను దర్శించుకుని ఇంటికొచ్చిన దుర్గ.. కోపంతో ఊగిపోతూ చావగొట్టిన అత్త!
- ఆసుపత్రి పాలైన కనకదుర్గ
- స్వామివారిని దర్శించుకున్న తొలి మహిళగా రికార్డు
- ఆసుపత్రిలో చేరిన బాధితురాలు
తాము వెళ్లవద్దని చెప్పినా వినకుండా స్వామిని దర్శించుకున్న కోడలిని చూడగానే ఆమె కోపంతో ఊగిపోతూ దాడిచేసింది. ఓ బలమైన వస్తువుతో తలపై కొట్టింది. దీంతో బాధితురాలు తిరువనంతపురంలోని ఓ ఆసుపత్రిలో చేరింది. బిందు అనే మహిళతో కలిసి ఈ ఏడాది జనవరి 2న కనకదుర్గ గట్టి పోలీస్ భద్రత మధ్య అయ్యప్ప స్వామిని దర్శించుకుంది. దీంతో హిందుత్వ సంఘాలు బెదిరింపులకు దిగడంతో వీరిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కాగా, కనకదుర్గ ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.