కాసేపట్లో శబరిమలలో మకరజ్యోతి దర్శనం.. వేచి చూస్తున్న లక్షలాది భక్తులు!
- పంపా నది, సన్నిధానం, హిల్ టాప్.. వద్ద ఏర్పాట్లు
- అన్ని ఏర్పాట్లు చేసిన ట్రావెన్ కోర్ దేవస్థానం
- సాయంత్రంతో ముగియనున్న తిరువాభరణ ఘట్టం
అయ్యప్పస్వామి వారి తిరువాభరణాలను ఈరోజు సాయంత్రం 6 గంటలకు సన్నిధానానికి తరలించనున్నారు. 6.30 గంటలకు దీపారాధనతో తిరువాభరణ ఘట్టం పూర్తవుతుంది. అనంతరం, పొన్నంబలమేడు నుంచి అయ్యప్ప జ్యోతి రూపంలో భక్తులకు దర్శన మివ్వనున్నారు. ఈ నెల 19 వరకు అయ్యప్పస్వామిని దర్శించుకునే అవకాశం భక్తులకు కల్పించనున్నారు. ఈ నెల 20న పందళ రాజవంశీకులు స్వామి వారి దర్శనం తర్వాత శబరిమల ఆలయాన్ని మూసివేస్తారు.