Vivo Z3i: ఆకట్టుకునే ఫీచర్లతో వివో నుండి మరో స్మార్ట్ ఫోన్

  • 'వివో జ‌డ్‌ 3ఐ స్టాండర్డ్ ఎడిషన్' విడుదల 
  • ధర సుమారుగా రూ.25,608
  • మూడు రంగులలో లభ్యం
వివో మొబైల్ తయారీదారు గత సంవత్సరం అక్టోబర్ లో విడుదల చేసిన జ‌డ్‌ 3ఐ స్మార్ట్‌ ఫోన్‌ కి స్టాండర్డ్ ఎడిష‌న్ వేరియెంట్‌ ను తాజాగా చైనా మార్కెట్ లో విడుద‌ల చేసింది. అరోరా బ్లూ, డ్రీం పింక్, స్టారీ నైట్ అనే కలర్ ఆప్షన్లలో 'వివో జ‌డ్‌ 3ఐ స్టాండర్డ్ ఎడిషన్' లభించనుంది. దీని ధర మనదేశంలో సుమారుగా రూ.25,608 ఉండనుంది. 6.3 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్ల‌స్ ఎల్సీడీ డిస్ప్లేతో పాటు దీనిలో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పీ60 చిప్ సెట్ ని అమర్చారు.

ప్రత్యేకతలు:

  • మీడియాటెక్ హీలియో పీ60 ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌
  • 6.3" ఫుల్ హెచ్డీ ప్ల‌స్ ఎల్సీడీ డిస్ప్లే
  • 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌
  • 16/5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు
  • 24 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
  • 3315 ఎంఏహెచ్ బ్యాట‌రీ
  • ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఆపరేటింగ్ సిస్టం
Vivo Z3i
Standard Edition
smartphone
Tech-News
technology
China
స్మార్ట్ ఫోన్

More Telugu News