Vijayawada: విజయవాడలో కోడిపందాలను అడ్డుకున్న పోలీసులు

  • భవానీపురంలో కోడిపందాలను అడ్డుకున్న పోలీసులు  
  • కాసేపట్లో నిర్వహిస్తారనగా పోలీసులకు సమాచారం
  •  పోలీసులపై రాజకీయ ఒత్తిడి
సంక్రాంతి పండగ సందర్భంగా ఏపీలోని ఉభయగోదావరి జిల్లాలు సహా విజయవాడలో కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. అయితే, విజయవాడలోని భవానీపురంలో కోడిపందాలు నిర్వహించేందుకు సిద్ధపడుతున్న సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. కోడి పందాలు కాసేపట్లో నిర్వహిస్తారనగా విజయవాడ సిటీ కమిషనర్ ద్వారకా తిరుమలరావుకు సమాచారం అందింది. దీంతో, అక్కడికి చేరుకున్న పోలీసులు పందాలు నిర్వహించకుండా అడ్డుకున్నారు. అయితే, కోడిపందాలను ఎలాగైనా సరే నిర్వహించేందుకు పందెంరాయుళ్లు పోలీసులపై రాజకీయఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది.
Vijayawada
kodipandalu
police
bhavanipuram

More Telugu News