Andhra Pradesh: ఏపీలో టోల్ ట్యాక్స్ రద్దు ఆదేశాలను అమలు చేయని నిర్వాహకులు!

  • ఏపీ ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు
  • గుంటూరు, కృష్ణా జిల్లాల్లో టోల్ ట్యాక్స్ వసూలు
  • తమకు ఆదేశాలు అందలేదంటున్న నిర్వాహకులు
సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా ఏపీ ప్రభుత్వం టోల్ ట్యాక్స్ ను రద్దు చేస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఆదేశాలను ఆయా టోల్ గేట్ల నిర్వాహకులు మాత్రం బేఖాతరు చేశారు. ఈ విషయమై ప్రశ్నిస్తున్న వాహనదారులకు.. తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని నిర్వాహకులు చెబుతున్నారు. గుంటూరు జిల్లా ఖాజా, కృష్ణా జిల్లా చిల్లకల్లు టోల్ గేట్ల వద్ద యథావిధిగా రుసుం వసూలు చేశారు. కాగా, నేడు సహా 13,16 తేదీల్లో టోల్ ట్యాక్స్ ను ఎత్తివేయాలని ఈ మేరకు అధికారులకు ఆదేశాలు అందాయి.   
Andhra Pradesh
toll gate
sankranthi
khaza
Guntur District
Krishna District
chillakallu

More Telugu News