modi: ముగ్గురు మోదీలతో మనం పోరాడాలి: సీఎం చంద్రబాబు

  • కేంద్రంపై విరుచుకుపడ్డ చంద్రబాబు 
  • మోదీ, కేసీఆర్, జగన్ లపై నిప్పులు చెరిగిన బాబు
  • ప్రజలు బాగుపడటం వైసీపీకి ఇష్టం లేదు
ఏపీపై కేంద్రం తీరుపై సీఎం చంద్రబాబునాయుడు విరుచుకుపడ్డారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీ అభివృద్ధికి ముగ్గురు మోదీలు అడ్డుపడుతున్నారంటూ మోదీ, కేసీఆర్, జగన్ లపై నిప్పులు చెరిగారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఈ ముగ్గురు మోదీలతో మనం పోరాడాలని పిలుపు నిచ్చారు. ప్రజలు బాగుపడటం వైసీపీకి ఇష్టం లేదని, కడుపు మంటతో ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొందరు ఏపీపై ప్రేమ ఒలకబోస్తున్నారని ఎద్దేవా చేశారు.
modi
kcr
jagan
Chandrababu
Andhra Pradesh

More Telugu News