Big C: హ్యాక్ ఐ యాప్ ద్వారా మొబైల్ దొంగలను పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు

  • 28న బిగ్ సీలో 35 సెల్‌ఫోన్ల చోరీ
  • దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు
  • హ్యాక్ ఐ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచన

ఇటీవల హైదరాబాద్‌లోని బీరంగూడ వద్ద రామచంద్రాపురంలో ఉన్న బిగ్‌సీ మొబైల్స్ షోరూం వెనుక కన్నంపెట్టి 35 ఖరీదైన సెల్‌ఫోన్లను చోరీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును అత్యాధునిక సాంకేతికతను వినియోగించి దర్యాప్తు చేసి, దొంగలను పట్టుకున్నారు. గత నెల 28న బిగ్‌ సీ షోరూంలో 35 సెల్‌ఫోన్లు చోరీకి గురయ్యాయి. వాటిని నేడు అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ప్రైవేటు మార్కెట్‌లో విక్రయించేందుకు ప్రయత్నించగా.. పోలీసులు దొంగలను అరెస్ట్ చేశారు.

ఈ ఫోన్లను హ్యాక్ ఐ యాప్ ద్వారానే గుర్తించినట్టు సీపీ అంజన్ కుమార్ వెల్లడించారు. ఈ కేసు వివరాలను ఆయన మీడియాకు వివరించారు. ప్రజలు హ్యాక్ ఐ యాప్‌ను తమ మొబైల్ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించారు. నగరంలో మొత్తం 60 పోలీస్ స్టేషన్లకు గానూ.. 34 చోట్ల సీసీ కెమెరాలను వీక్షించే పీవీఎస్‌లను ఏర్పాటు చేశామని.. మరో రెండు నెలల్లో మిగిలిన స్టేషన్లలో కూడా పూర్తి చేస్తామన్నారు.

More Telugu News