హీరోగా ఎంట్రీ ఇవ్వబోతోన్న కౌశల్?
- 'బిగ్ బాస్ 2' విజేతగా నిలిచిన కౌశల్
- బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి క్రేజ్
- హీరోగా 'సేనాని' సినిమా
ఓ యువ దర్శకుడు వినిపించిన కథ నచ్చడంతో, హీరోగా చేయడానికి కౌశల్ అంగీకరించినట్టుగా సమాచారం. ఈ సినిమాను నిర్మించడానికి ఒక నిర్మాత సిద్ధంగా ఉన్నాడనీ, ఆయనకి మెగా ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు వున్నాయనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఈ సినిమాకి 'సేనాని' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయట. సమకాలీన రాజకీయాల్లో పవన్ కల్యాణ్ పాత్ర ఆధారంగా ఈ సినిమా కొనసాగుతుందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.