Andhra Pradesh: తెలంగాణ హైకోర్టు సీజే రాధాకృష్ణన్ బదిలీ.. విభజన జరిగిన 10 రోజుల్లోనే నిర్ణయం!

  • కోల్ కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకం
  • జస్టిస్ డీకే గుప్తా స్థానంలో రాథాకృష్ణన్ బాధ్యతలు
  • 2018, జూలైలో తాత్కాలిక సీజేగా నియామకం

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ టీబీ రాధాకృష్ణన్ కు స్థానచలనం కలిగింది. ఆయన్ను కోల్ కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. కోల్ కతా హైకోర్టు సీజేగా ఇప్పటివరకూ పనిచేసిన జస్టిస్ డీకే గుప్తా పదవీవిరమణ చేయడంతో జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ సిక్రీ, జస్టిస్ బాబ్డే, జస్టిస్ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రాలు సభ్యులుగా ఉన్న కొలీజియం తాజా నిర్ణయం తీసుకుంది.

ఉమ్మడి హైకోర్టు విభజన తర్వాత జస్టిస్ రాధాకృష్ణన్ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 10 రోజులు పనిచేశారు. కేరళ హైకోర్టులో జడ్జీగా 2004, అక్టోబరులో రాధాకృష్ణన్ నియమితులయ్యారు. అనంతరం 2017, మార్చి 18న ఛత్తీస్ గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. కాగా, తెలంగాణ హైకోర్టులో జస్టిస్ రాధాకృష్ణన్ తర్వాత అత్యంత సీనియర్ అయిన జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

More Telugu News