Narendra Modi: తెలంగాణ నేత మురళీధర్ రావును ప్రపంచానికే ఇష్టమైన జననేతగా అభివర్ణించిన మోదీ

  • బీజేపీ జాతీయ మండలి సమావేశాలు
  • హాజరైన 12 వేల మంది ప్రతినిధులు
  • మోదీ నామస్మరణలో మునిగిన నేతలు

ఢిల్లీలోని రాంలీలా మైదానంలో శుక్రవారం నిర్వహించిన బీజేపీ చివరి జాతీయ మండలి సమావేశాల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఆ పార్టీ తెలంగాణ నేత మురళీధర్ రావుపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచానికే ఇష్టమైన జననేత (విశ్వకే లోక్‌ప్రియ జన నేత)గా అభివర్ణించారు. మరోవైపు, సమావేశం మొత్తం మోదీ నామస్మరణతో హోరెత్తింది. ‘భారత్ మాతాకీ జై’ నినాదాలతో ప్రాంగణం మార్మోగింది. సభకు మొత్తం 12 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. మోదీ సర్కారును మళ్లీ తీసుకొచ్చేందుకు సంకల్పం తీసుకోవాలంటూ అందరితో ప్రతిజ్ఞ చేయించారు.

ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పార్టీ చీఫ్ అమిత్ షాను ప్రశంసల్లో ముంచెత్తారు. అమిత్ షా మాట్లాడుతూ.. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని తగ్గించి కోట్లాదిమంది చిన్న వ్యాపారులను మోదీ ఆదుకున్నారని ప్రశంసించారు. ఈ ఇద్దరి జోడీ అపూర్వమంటూ మురళీధర్ రావు కొనియాడారు. ఇక ఆ తర్వాత మాట్లాడిన మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్‌లు కూడా మోదీని పొగడ్తల్లో ముంచెత్తారు. ఇలా.. సమావేశం మొత్తం మోదీ నామస్మరణకే పరిమితమైంది.

More Telugu News