బామ్మ పాత్రకి సమంత నో చెప్పేసిందట
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బామ్మ పాత్రకి సమంత నో చెప్పేసిందట

  • సమంత ప్రధాన పాత్రధారిగా ' ఓ బేబీ'
  • కొరియన్ మూవీకి రీమేక్ 
  • కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ లక్ష్మి
నిన్నమొన్నటి వరకూ గ్లామర్ పాత్రలనే ఎక్కువగా చేస్తూ వచ్చిన సమంత, ఇటీవల కాలంలో నటనకి ఎక్కువ ప్రాధాన్యత కలిగిన పాత్రలను చేయడానికి ఆసక్తిని చూపుతోంది. నటన పరంగా తనకి మరింత పేరు తెచ్చిపెట్టే విభిన్నమైన పాత్రలను చేయడానికి ఉత్సాహాన్ని కనబరుస్తోంది. అలాగే ఆమె నందినీ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి అంగీకరించింది. కొరియన్ మూవీ 'మిస్ గ్రానీ'కి ఇది రీమేక్.

ఈ సినిమాకి 'ఓ బేబీ' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో సమంత  యువతిగానే కాకుండా 70 యేళ్ల బామ్మగాను కనిపించనుందనే టాక్ వచ్చింది. అయితే, ముందుగా బామ్మ పాత్ర చేయడానికి సమంత అంగీకరించినప్పటికీ, ఆ తరువాత సన్నిహితుల సలహా మేరకు వెనక్కి తగ్గిందనేది తాజా సమాచారం. వృద్ధురాలి పాత్రలో కనిపిస్తే ఆ ప్రభావం కెరియర్ పై పడుతుందని భావించి ఆమె 'నో' చెప్పేసిందట. దాంతో వృద్ధురాలి పాత్రకి సీనియర్ హీరోయిన్ లక్ష్మిని ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. అంటే యువతిగా వున్నప్పుడు సమంత, ఆ పాత్రకి ముసలితనం వచ్చినప్పుడు లక్ష్మి తెరపై కనిపిస్తారన్న మాట.
samanta
lakshmi

More Telugu News